1990లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఐకానిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి(Chiranjeevi), శ్రీదేవి (Sridevi) జంటగా నటించిన ఈ చిత్రం, రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో అశ్వినీదత్ (C. Aswani Dutt) నిర్మాణంలో వచ్చి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ సినిమాను 2డీ, 3డీ వెర్షన్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ హోర్డింగ్స్, ప్రమోషన్ ఈవెంట్స్‌తో హడావిడి చేశారు.
ఈ సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అశ్వినీదత్ ఈ సీక్వెల్ ఆలోచనపై ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నాడు, కానీ రాఘవేంద్రరావు మాత్రం ఈ ఆలోచనపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే, రీసెంట్ రీ-రిలీజ్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ (Ram Charan) మాట్లాడుతూ, ఈ సీక్వెల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సినిమాలోని రింగ్, చేప ఎలాంటి మిస్టరీని కలిగి ఉన్నాయని, వాటి కథను కొనసాగించాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను (Nag Ashwin) డిమాండ్ చేస్తున్నానని చెప్పాడు.
రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో సీక్వెల్‌పై ఆసక్తిని మరింత పెంచాయి. చిరంజీవి కూడా ఈ సీక్వెల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటిస్తే బాగుంటుందని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ పేరును చరణ్ ప్రస్తావించడం ఈ సీక్వెల్‌పై తెరవెనుక చర్చలు జరుగుతున్నాయనే సంకేతమని అంటున్నారు.
ప్రస్తుతం నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ, చరణ్ డిమాండ్‌ను సీరియస్‌గా తీసుకుని ఈ సీక్వెల్‌ను తెరపైకి తీసుకొస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్‌లో నాగ్ అశ్విన్ లాంటి విజనరీ డైరెక్టర్ పనిచేస్తే, ఈ సినిమా మరో సంచలనాన్ని సృష్టించవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సీక్వెల్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటతో తెరపైకి వస్తే, అప్పటి మ్యాజిక్‌ను ఈ తరానికి మరోసారి అందించే అవకాశం ఉంటుంది.
Megastar #Chiranjeevi About #JVAS2
Hero – #RamCharan
Heroine – #JanhviKapoor
Direction – #NagAshwin
Direction Super Vision – #KRaghavendraRao
Production – #VyjayanthiMovies#JagadekaVeeruduAthilokaSundari #Sridevi pic.twitter.com/XU2jJgJqZT— Filmy Focus (@FilmyFocus) May 8, 2025