టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) ఆర్.ఆర్.ఆర్ (RRR) తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోగా ఆచార్య సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తర్వాత సినిమాలు బుచ్చిబాబు (Buchi Babu Sana), సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ఈ సినిమాల తర్వాత చరణ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు డీవీవీ దానయ్య (D. V. V. Danayya) నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం అందుతోంది.
Ram Charan , Prashanth Neel
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాల విషయంలో చరణ్ వేగం పెంచుతుండగా చరణ్ ప్రశాంత్ మధ్య ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సైతం ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సలార్2 (Salaar), కేజీఎఫ్3 (KGF) పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు.
ప్రశాంత్ నీల్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటుండగా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. చరణ్ తన సినిమాల కోసం పని చేసే హీరోయిన్లు, టెక్నీషియన్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
చరణ్ కెరీర్ విషయానికి వస్తే గేమ్ ఛేంజర్ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. డిసెంబర్ 20 లేదా డిసెంబర్ 25 తేదీలలో ఏదో ఒక తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ 2025లో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చరణ్ కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.