రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ బోయపాటి దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున ఆ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని మెగా అభిమానులు ఆశపడ్డారు. సైరా టీజర్ తప్ప.. రామ్ చరణ్ మూవీ గురించి ఏ అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఇలా చేస్తే ఆ సినిమా గురించి ఎలా ప్రజలకు తెలుస్తుందని ఫ్యాన్స్ చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచే పబ్లిసిటీ మొదలపెట్టమని కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ సలహాని చెర్రీ పాజిటివ్ గానే తీసుకున్నారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న తన కొత్తమూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల.. ఆ లోటుని భర్తీ చేస్తూ అదే రోజున లుక్ విడుదల చేసే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
భరత్ అనే నేను బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చే పనిలో ఉన్నారు. రాజవంశస్థుల నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాకి ఏ టైటిల్ పెట్టారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కి అన్నయ్యలుగా తమిళ హీరో ప్రశాంత్ (జీన్స్ హీరో), నవీన్ చంద్ర(అందాల రాక్షసి), ఆర్యన్ రాజేష్ (సొంతం) నటిస్తున్నారు. చెర్రీ కి వదినలుగా అలనాటి హీరోయిన్ స్నేహ, అనన్య (‘జర్నీ’ ఫేం), హిమజలు కనిపించనున్నారు. విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఓబరాయ్ పోటీపడుతున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.