నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ మధ్య కాలంలో చిరంజీవి, చరణ్ నటించిన సినిమాలేవీ ఇంత తక్కువ కలెక్షన్లను సాధించలేదు. మరోవైపు ఆచార్య బయ్యర్లకు ఈ సినిమా ద్వారా 60 శాతం నుంచి 70 శాతం వరకు నష్టాలు వచ్చాయి.
ఆచార్య నష్టాల భర్తీ కోసం రామ్ చరణ్ సైతం తన వంతు సహాయం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. వేర్వేరు రూపాల్లో చరణ్ బయ్యర్లను ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. చరణ్ డబ్బు రూపంలో కొంత మొత్తం వెనక్కు ఇవ్వనున్నారని సమాచారం. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ ల హక్కులను, తన భవిష్యత్తు సినిమాల హక్కులను తక్కువ మొత్తానికే ఇస్తానని కొంతమంది బయ్యర్లకు చరణ్ హామీ ఇచ్చారని బోగట్టా.
కొరటాల శివ సైతం బయ్యర్లకు ఎన్టీఆర్ మూవీ హక్కులను కొంతమేర తక్కువకే ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. చరణ్, కొరటాల తీసుకున్న నిర్ణయంను నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు. చిరంజీవి కొన్నిరోజుల క్రితమే 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆచార్య బయ్యర్లకు నష్టాలు భర్తీ అవుతుండటంతో వాళ్లు సైతం సంతోషిస్తున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమాపై ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు కొరటాల శివ ఎన్టీఆర్ కాంబో మూవీ షూట్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది.
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!