‘గేమ్ చేంజర్’ (Game Changer) ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రబృందం మొత్తం హాజరైంది. ముఖ్య అతిథిగా సుకుమార్ పాల్గొని, సినిమా హిట్ అయినట్లే అని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. “పుష్ప 2” (Pushpa 2: The Rule) వంటి భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్ (Sukumar) నుంచి వచ్చిన ఈ ప్రశంస ఫ్యాన్స్ లో సినిమా మీద అంచనాలు పెంచింది. ఇక ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ (Ram Charan) తన కామెడీ టైమింగ్ తో దిల్ రాజుపై (Dil Raju) జోక్ చేశారు.
Ram Charan
‘రా మచ్చా మచ్చా’ సాంగ్ కి స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచారు. సినిమా గురించి మాట్లాడుతూనే ప్రేక్షకుల కోసం అన్ని ఎలిమెంట్స్ ఇరుకు అని అన్నారు. గతంలో విజయ్ (Vijay Thalapathy) ‘వారిసు’ (Varisu) ప్రమోషన్ సందర్భంగా దిల్ రాజు చేసిన తమిళ-తెలుగు మిక్స్ కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భాన్ని చరణ్ వినూత్నంగా ప్రస్తావించి నవ్వులు పంచారు.
దిల్ రాజు పై సరదాగా స్పందించిన చరణ్ (Ram Charan) , ఫైట్స్ వేనమా ఫైట్స్ ఇరుకు, సాంగ్స్ వేనమా సాంగ్స్ ఇరుకు అంతేనా సర్ అంటూ సరదాగా అడిగారు. అనంతరం నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ కు ఆ డైలాగ్ ఏంటనేది చెప్పడంతో మీకు ఈ సినిమాలో ఎన్న వేనమా అన్ని ఇరుక్కు అంటూ తమిళ్ లో ఫన్నీ గా చెప్పారు. దీంతో ఫ్యాన్ అందరూ కూడా నవ్వుతూ విజిల్స్ వేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, ఈ చిత్రంలో సాంగ్స్, ఫైట్స్ అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయని, ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకులను అలరించేందుకు అన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, రామ్ చరణ్ ఈ సినిమా సంగీతం అందించిన తమన్ (S.S.Thaman) పని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అందించిన ట్యూన్స్ అద్భుతమని చెప్పి, మరోసారి మార్కులు కొట్టేశాడని చరణ్ వ్యాఖ్యానించారు. స్పీచ్ ముగింపు లో భాగంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజీ’(OG Movie) మూవీ గురించి ప్రస్తావించారు. ఆ సినిమా కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెలిపారు.