టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan) కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతుండగా రెండు రోజుల క్రితం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారంటూ ఒక వార్త వైరల్ అయింది. ఈ విషయాన్ని మరవక ముందే చరణ్ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ స్టార్ హీరో రామ్ చరణ్ ను 15వ ఎడిషన్ వేడుకలకు గౌరవ అతిథిగా ఆహ్వానించింది.
ఆగష్టు నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న హీరోల జాబితాలో రామ్ చరణ్ మాత్రమే ఉండటం గమనార్హం. రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కడంపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రామ్ చరణ్ ఈ వేడుకలకు హాజరు కానుండటం మరపురాని అంశం అని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తెలిపింది.
రామ్ చరణ్ నటించిన సినిమాను ఈ వేడుకలలో ప్రదర్శించడంతో పాటు రామ్ చరణ్ కు బిరుదును సైతం ప్రధానం చేయనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ వేడుకలకు ఆహ్వానం అందడం గురించి రామ్ చరణ్ స్పందించారు. తనకు ఆహ్వానం అందడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చరణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత గుర్తింపు, ప్రేమ దక్కడాన్ని మరవలేనని చరణ్ తెలిపారు.
మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game Changer) రిలీజ్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొంది. గేమ్ ఛేంజర్ ఈ ఏడాది విడుదల కాకపోతే ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కెరీర్ పరంగా తెలివిగా అడుగులు వేస్తున్న రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలతో సైతం బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.