Charan, Upasana: ఉపాసన – రామ్ చరణ్ కపుల్ వెకేషన్‌ వీడియో వైరల్..!

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 38వ పుట్టినరోజు సందర్భంగా.. ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారి విషెస్, కొత్త సినిమా (గేమ్ ఛేంజర్) అప్‌డేట్స్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోయింది.. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం, ఇటీవల ‘నాటు నాటు’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ రావడం ఈ పుట్టినరోజు ప్రత్యేకం..ఇక తనయుడి బర్త్‌డే సందర్భంగా చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీ వారికి, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారు..

రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి ఫ్యామిలీ, కార్తికేయ ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ, వెంకటేష్, రానా, జగపతి బాబు, నిఖిల్, సుకుమార్, విజయ్ దేవరకొండ, కాజల్ కపుల్, జానీ మాస్టర్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, మౌనిక దంపతులు, థమన్, ప్రశాంత్ నీల్.. అలాగే ఇండస్ట్రీలోని పలు విభాగాలకు చెందిన వారంతో అటెండ్ అయ్యి.. చరణ్‌‌కి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.. ఈ పార్టీకి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి..

ఇక ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ నుండి హైదరాబాద్ తిరిగొచ్చిన చెర్రీ (Charan) .. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట సెట్‌లోనే ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేశారు.. తర్వాత పుట్టినరోజు పార్టీతో ఫుల్ బిజీ అయిపోయాడు.. ఆ పార్టీలో మెగా కోడలు ఉపాసన బేబి బంప్‌తో కనిపించారు.. చరణ్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటే ఇప్పుడు వెకేషన్‌కి వెళ్లిపోయాడు..

ఈ సెలబ్రిటీ కపుల్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు.. ప్రైవేట్ జెట్‌లో ట్రావెల్ చేస్తున్న వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు.. వీడియోతో పాటు చరణ్ తన పెట్ రైమ్‌ని ఒళ్లో కూర్చోబెట్టుకున్న పిక్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.. ఉపాసన త్వరలో పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.. మరి కొద్దిరోజుల్లో వీరు దుబాయ్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ రానున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus