Upasana: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి..!

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. ఫ్యామిలీ మెంబర్స్, మెగా ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారి విషెస్, కొత్త సినిమా అప్ డేట్స్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోయింది.. చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం, ఇటీవల ‘నాటు నాటు’ పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ రావడం ఈ పుట్టినరోజు ప్రత్యేకం.. చిరంజీవి, ఉపాసన, శ్రీజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా చెర్రీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..

అలాగే చిరంజీవి ఇంట్లో ఇండస్ట్రీ వారికి, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.. రాజమౌళి ఫ్యామిలీ, కీరవాణి ఫ్యామిలీ, కార్తికేయ ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ, వెంకటేష్, రానా, జగపతి బాబు, నిఖిల్, సుకుమార్, విజయ్ దేవరకొండ, కాజల్ కపుల్, జానీ మాస్టర్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, మౌనిక దంపతులు, థమన్, ప్రశాంత్ నీల్.. అలాగే ఇండస్ట్రీలోని పలు విభాగాలకు చెందిన వారంతో అటెండ్ అయ్యి.. చరణ్‌‌కి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.. ఈ పార్టీకి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఈ పార్టీలో చరణ్ వైఫ్ ఉపాసన సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.. ఆమె బేబి బం‌ప్‌తో కనిపించారు.. చరణ్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ధరించగా, ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన బ్లూ కలర్ డ్రెస్‌లో చూడముచ్చటగా ఉన్నారు.. పార్టీలో పాల్గొనే ముందు ఫోటోలకు ఫోజులిచ్చిన మెగా కపుల్ భలే క్యూట్‌గా ఉన్నారంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న చెర్రీ – ఉపాసన పదేళ్ల తర్వాత పేరెంట్స్ కాబోతున్నారు.. గతేడాది ఈ గుడ్ న్యూస్‌ని అందరితీ షేర్ చేసుకున్నారు.. త్వరలో మెగా కోడలు పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.. అలాగే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus