అప్పట్లో ఆగ్రా వెళ్ళి తాజ్ మహల్ చూడలేకపోయినవారందరూ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని చిన్న తాజ్ మహల్ ను చూసి సంతోషపడేవారట. ఇప్పుడు “సినిమా చూపిస్తా మావా, నేను లోకల్” చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకొని మరో సినిమా కోసం రంగం సిద్ధం చేసుకొంటున్న త్రినాధరావు నక్కిన పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. నిజానికి త్రినాధరావు తన తదుపరి చిత్రాన్ని కాస్త భారీ స్కేల్ లో తీద్దామని ఫిక్స్ అయ్యి రామ్ చరణ్ కి కథ చెప్పి అదే కథను మైత్రీ మూవీ మేకర్స్ చేత కూడా ఒకే చేయించుకొని ఇక సినిమా సెట్స్ కి వెల్లడమే లేట్ అనుకొంటున్న తరుణంలో ప్లాన్ తారుమారైంది. చరణ్ “రంగస్థలం” అనంతరం బోయపాటితో ఒక సినిమా, కొరటాలతో ఒక సినిమా ఓకే చేయడంతో.. తాను సిద్ధం చేసుకొన్న కథను దిల్ రాజుకు వినిపించాడట త్రినాధరావు.
“నేను లోకల్”ను ప్రొడ్యూస్ చేయడంతోపాటు త్రినాధరావు దర్శకత్వంలో రూపొందిన “సినిమా చూపిస్త మావ” చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ కూడా చేసిన దిల్ రాజుకు త్రినాధరావు మీదున్న నమ్మకంతో ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు. అయితే.. త్రినాధరావు ప్లాన్ చేసుకొన్నట్లు రాంచరణ్ తో కాక రామ్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తానన్నాడట. సో, అనుకున్నది ఎలాగో జరగలేదు కాబట్టి ఉన్నదాంతో సరిపెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడట త్రినాధరావు.