రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై ట్విట్టర్ వేదికగా వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సర్కస్ అని వర్మ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. అయితే తాజాగా ఒక టీవీ ఛానల్ ప్రోగ్రామ్ కు హాజరైన వర్మ ప్రేక్షకుల్లో సినిమా వాళ్లంటే అద్భుతం అనే భావన ఉండేదని ఎన్నికల వల్ల వీళ్లు వెధవలు అని ఫీలవుతున్నారని వర్మ చెప్పుకొచ్చారు.
ఎవరో కుట్రలు పన్ని ఈ విధంగా చేయలేదని ఎవరికి వారు అనుకోకుండానే ఈ పరిస్థితికి తెచ్చారని వర్మ పేర్కొన్నారు. ఎవరినీ ఉద్దేశించి తాను మాట్లాడలేదని వర్మ కామెంట్లు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను, ఎన్నికలను కలిపి జోకర్లు అనే మాటను అన్నానని వర్మ తెలిపారు. అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకని ఆ అసోసియేషన్ కు బిల్డింగ్ ఎందుకని వర్మ ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు మ్యానిఫెస్టోలు ఎందుకని వర్మ ఘాటుగా కామెంట్లు చేశారు.
హౌసింగ్ సొసైటీలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పోలిస్తే 50 రెట్లు ఎక్కువమంది ఉన్నారని వాళ్లకు బిల్డింగ్ లు ఉన్నాయా? అని వర్మ ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనానికి, ఎన్నికలకు లింక్ ఏంటనేది తనకు పెద్ద క్వశ్చన్ మార్క్ అని వర్మ చెప్పుకొచ్చారు. మీడియా కెమెరాలను చూసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు నటన మొదలుపెట్టారని వర్మ చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన చాలారోజుల తర్వాత వర్మ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 600 ఓట్ల కోసం హీరోలు జీరోలయ్యారని వర్మ అన్నారు.