RGV,Krishnam Raju: వర్మ క్యాస్ట్ ఫీలింగ్ తోనే షూటింగ్లు ఆపమంటున్నాడా..!

  • September 12, 2022 / 06:16 PM IST

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత, మంత్రి, పారిశ్రామికవేత్త అయిన ఉప్పలపాటి కృష్ణంరాజు గారు ఆదివారం కాలం చేశారన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చాలామంది ఆయన ఇంటికి వచ్చి నివాళులర్పించారు. సోషల్ మీడియాల్లో కృష్ణంరాజు మరణానికి చింతిస్తున్నట్టు ట్వీట్లు వేశారు. అయితే కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తవకుండానే షూటింగ్లు జరుపుకుంటున్నారు. కృష్ణంరాజు నటుడు మాత్రమే కాదు ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ గా అలాగే ఇండస్ట్రీకి పెద్దగా కొన్నాళ్ళు వ్యవహరించారు.

కాబట్టి ఆయన అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అయినా షూటింగ్లు ఆపితే బాగుణ్ణు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అయితే స్టార్ హీరోలు, నిర్మాతలపై మండిపడుతున్నాడు. ” భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!” ,

“కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి , మోహనబాబుగారికి, బాలయ్యకి , ప్రభాస్ కి,మహేష్,కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. ” మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం.

డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది “, మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. ” అంటూ ట్వీట్లు వేస్తున్నాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా కానీ.. రాంగోపాల్ వర్మ ఇలా ట్వీట్లు వేసేది కృష్ణంరాజు పై అభిమానంతో కాదు.. కేవలం క్యాస్ట్ ఫీలింగ్ తోనే అని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

“కృష్ణంరాజు, రాంగోపాల్ వర్మ ది ఒకే క్యాస్ట్ అతను ఇలా సింపతీ చూపిస్తున్నాడు, ‘సాహో’ రిలీజ్ సమయంలో భీమవరంలో పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు బ్యానర్లు కట్టిన వీడియోని వర్మ షేర్ చేసి ‘నాకు క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ. అందుకే నాకు ప్రభాస్ అంటే ఇష్టం’ అన్నట్టు కామెంట్లు చేసిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus