పబ్లిసిటీ కోసం వర్మ ఏమైనా చేస్తాడు, ఎంతటి నీచానికైనా దిగజారతాడు అని గత రెండేళ్లుగా వర్మను చూస్తున్నవాళ్లందరికీ ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది. వరల్డ్ ఫస్ట్ పెయిడ్ ట్రైలర్ అని “పవర్ స్టార్”ను వర్మ ప్రమోట్ చేసిన విధానం అద్భుతమనే చెప్పాలి. రాజమౌళి కూడా తన తదుపరి చిత్రానికి ఈ ఫార్మాట్ ను వాడాలి అని ఆర్జీవీ చేసిన హల్ చల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటిది 11 గంటలకు విడుదలవ్వాల్సిన ట్రైలర్ 8.00 గంటలకే యూట్యూబ్ లో ప్రత్యక్షమైంది.
ఇది వర్మ కావాలనే లీక్ చేయించాడా లేక పగబట్టిన పవన్ ఫ్యాన్స్ లీక్ చేయించారా అనేది తెలియదు కానీ.. ట్రైలర్ మాత్రం ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఇక్కడే వర్మ ఓవర్ యాక్షన్ మొదలైంది. తన టీం సభ్యులే ట్రైలర్ ను లీక్ చేశారని, అది ఎవరో తెలియదు కానీ.. డబ్బులు కట్టినవాళ్లందరికీ ఎమౌంట్ రిటర్న్ చేస్తానని చెప్పుకొచ్చాడు వర్మ.
అయితే.. జనాలు 25 రూపాయలు కట్టడం కోసం 5 రూపాయల ఇంటర్నెట్ చార్జెస్ కూడా పే చేశారు. మరి వర్మ ఆ 5 రూపాయలతో కలిపి 30 రూపాయలు ఎలాగూ వెనక్కి ఇవ్వలేడు కాబట్టి.. మరోసారి వర్మ తన వెర్రితో జనాల్ని వెర్రి పుష్పాలను చేశాడు. మరి 25వ తారీఖున ఇదే జనాలు పవర్ స్టార్ వెబ్ ఫిలిమ్ చూశాక ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.