టాలీవుడ్ ఇండస్ట్రీలో పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం ఇలా ఏ జోనర్ సినిమాలోనైనా నటించే అతి కొద్దిమంది నటుల్లో బాలకృష్ణ ఒకరు. ఒక దశలో బాలకృష్ణ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కథల ఎంపికలో జాగ్రత్త వహించి బాలయ్య విజయాలను సొంతం చేసుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో బాలకృష్ణ హీరోగా కొనసాగుతున్నారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన బాలకృష్ణ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రస్తుతం హిట్ టాక్ వచ్చిన సినిమాలైనా థియేటర్లలో కేవలం రెండు వారాలకే పరిమితమవుతుంటే బాలయ్య లెజెండ్ సినిమా ఒక థియేటర్లో 400 రోజులు ఆడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తెలుగులో పద్యాలు, శ్లోకాలు అవలీలగా చెప్పే నటుల్లో బాలయ్య ఒకరనే సంగతి తెలిసిందే. నర్తనశాల బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా సౌందర్య మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో షూటింగ్ జరుపుకున్న కొంతభాగాన్ని బాలయ్య గతేడాది విడుదల చేశారు.
తన సినీ కెరీర్ లో బాలకృష్ణ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడం గమనార్హం. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య అఘోరా గెటప్ లో నటిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్రాక్ డ్రాప్ లో బాలయ్య నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి. ఇండియాలో తండ్రి బయోపిక్ లో తండ్రి పాత్రలో నటించిన ఏకైక హీరోగా బాలయ్య రికార్డును సొంతం చేసుకున్నారు. తండ్రి బయోపిక్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం బాలయ్యను బాధ పెట్టినట్టు తెలుస్తోంది. అఖండ టీజర్ తో కూడా బాలకృష్ణ కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.