Rashmi Gautam: రష్మీ జాతకాన్ని చిరంజీవి మారుస్తారా?

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వేదాళం రీమేక్ గా భోళా శంకర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు ఈ మూవీ లాంఛ్ ఘనంగా జరగగా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని అధికారక ప్రకటన వెలువడింది. రష్మీ గౌతమ్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా ఆమెకు నటిగా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

చిరంజీవి సినిమాతో రష్మీ గౌతమ్ జాతకం మారుతుందేమో చూడాల్సి ఉంది. మరో యాంకర్ శ్రీముఖి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే సినిమాలలో నటిస్తున్న బిత్తిరి సత్తి సైతం ఈ మూవీలో నటిస్తున్నారని సమాచారం. రష్మీ గౌతమ్ ఈ సినిమాలో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారో లేక గ్లామర్ రోల్ లో కనిపిస్తారో చూడాల్సి ఉంది. ప్రభాస్ శ్రీను, ఉత్తేజ్, గెటప్ శ్రీను ఈ సినిమాలో నటిస్తున్నారు.

రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, రవిశంకర్, తులసి, ప్రగతి ఈ సినిమాలోని ప్రధాన పాత్రలకు ఎంపికయ్యారని తెలుస్తోంది. చిన్న సినిమాలలో ఎక్కువగా నటించిన రష్మీ గౌతమ్ భోళా శంకర్ సినిమా సక్సెస్ సాధిస్తే పెద్ద సినిమాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది. రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. భోళా శంకర్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తానని మెహర్ రమేష్ నమ్ముతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus