‘భోళా శంకర్’ : రష్మీ ఐటెం సాంగ్ కు అంత భారీగానా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ మూవీ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఏకె.ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. చెల్లెలి పాత్రని కీర్తి సురేష్ పోషిస్తోంది. ఇక ఐటెం సాంగ్ కోసం బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ ఎంపికైన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు మహతి సాగర్ సంగీతంలో రూపొందనున్న మాస్ బీట్ లో చిరుతో కలిసి చిందులు వేయబోతుంది రష్మీ.

ఈ మధ్య కాలంలో రష్మీ సినిమాల్లో కనిపించింది లేదు. ఎక్కువ శాతం బుల్లితెర పైనే షోలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఈ పాట కోసం 3 రోజులు కాల్ షీట్లు దర్శకుడు అడిగాడట. రూ.1 కోటి రూపాయలతో వేసిన సెట్లో చిరు, రష్మీ ల ఐటెం సాంగ్ ఉంటుందని సమాచారం. ఇక ఈ పాట కోసం రష్మీకి భారీ పారితోషికం ఇస్తున్నారని సమాచారం. ఆమె హీరోయిన్ గా చేసినప్పుడు తీసుకున్న పారితోషికం కంటే ఇది రెండింతలు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

నిర్మాత అనిల్ సుంకర కూడా ఖర్చుకి వెనుకాడే మనిషి కాదు. నటీనటులు ఎంత డిమాండ్ చేసినా చిరు నవ్వుతో ఓకే చెప్పేస్తుంటారు. ఇక ఈ సినిమా హిట్ అయ్యి.. ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల్ని మెప్పిస్తే రష్మీకి మరిన్ని ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు. 2022 లో ఈ ఐటెం సాంగ్ ను చిత్రీకరించనున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.