ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ‘బేబీ’ అనే సినిమా వచ్చింది. ‘హృదయ కాలేయం’ దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. 2023 జూలై 14న రిలీజ్ అయ్యింది. ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ బుల్గేనిన్ సంగీతంలో రూపొందిన ‘ ఓ రెండు ప్రేమ మేఘాలిలా’ అనే పాట సినిమాకి మంచి బజ్ తీసుకొచ్చింది. టీజర్, ట్రైలర్ వంటివి యూత్ ను, మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిసింది. రూ.8 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. హిందీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. నేటితో 2 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘బేబీ’ క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 16.12 cr |
సీడెడ్ | 5.77 cr |
ఉత్తరాంధ్ర | 6.25 cr |
ఈస్ట్ | 2.81 cr |
వెస్ట్ | 1.75 cr |
గుంటూరు | 2.10 cr |
కృష్ణా | 2.25 cr |
నెల్లూరు | 1.22 cr |
ఏపీ+తెలంగాణ | 38.27 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.14 cr |
ఓవర్సీస్ | 2.70 cr |
వరల్డ్ టోటల్ | 44.11 cr (షేర్) |
‘బేబీ’ చిత్రం రూ.6.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఆ టార్గెట్ ను 2 రోజుల్లోనే ఫినిష్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో ఏకంగా రూ.44.11 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.85 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.37.91 కోట్ల భారీ లాభాలు అందించింది ఈ సినిమా.