Rashmika: పుష్ప మూవీపై అంచనాలు పెంచేసిన రష్మిక!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో రష్మిక ఒకరు కాగా రష్మిక నటించిన టాలీవుడ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. రష్మిక నటిస్తున్న పుష్ప ది రైజ్, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు త్వరలో రిలీజ్ కానున్నాయి. పుష్ప పార్ట్1 ఈ నెల 17వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమాలో రష్మిక డీ గ్లామరస్ రోల్ లో నటిస్తున్నారు. అయితే రష్మిక ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఆమె కష్టం కూడా ఉందని రష్మిక సన్నిహితులు కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించడానికి రష్మిక ఎక్స్ ప్రెషన్స్ తో పాటు మేనరిజమ్స్ ను కూడా ప్రాక్టీస్ చేసిందని సమాచారం. చిత్తూరు యాసను నేర్చుకోవడానికి రష్మిక చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. తిరుపతికి వెళ్లిన సమయంలో జనాలతో మాట్లాడి రష్మిక అక్కడి కల్చర్, జీవన విధానం, ఇతర విషయాల గురించి తెలుసుకున్నారని బోగట్టా. ఆ కష్టం వల్లే రష్మిక శ్రీవల్లి పాత్రకు పర్ఫెక్ట్ గా సూటయ్యారు. తన పాత్రతో రష్మిక పుష్ప మూవీపై అంచనాలను పెంచేశారు.

ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాల సక్సెస్ తో క్రేజ్ సంపాదించుకున్న రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. రష్మిక క్రమశిక్షణతో ఉంటారని హార్డ్ వర్కింగ్ అని మిషన్ మజ్ను టీమ్ ప్రశంసించినట్టు తెలుస్తోంది. వర్క్ విషయంలో రష్మిక కమిట్మెంట్ సూపర్ అని మిషన్ మజ్ను హీరో సిద్దార్థ్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో కూడా రష్మిక స్టార్ స్టేటస్ అందుకుంటారేమో చూడాలి. సినిమాసినిమాకు రష్మికకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus