Rashmika Mandanna: రష్మికను ఘోరంగా అవమానించిన నెటిజన్.. కానీ?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాకు నేషనల్ క్రష్ గా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ భాషల్లో రష్మిక నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. దసరా పండుగ రోజున రష్మిక నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రష్మిక నవ్వుతూ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అయితే ఒక నెటిజన్ రష్మికను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో “ఎలా తీసుకున్నారురా దీన్ని” అంటూ ఏ మాత్రం గౌరవం, మర్యాద లేకుండా కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ రష్మిక దృష్టికి రావడంతో ఆమె “నా యాక్టింగ్ కోసం” తీసుకున్నారంటూ ఘాటుగా జవాబిచ్చారు. నెటిజన్ కు రష్మిక బుద్ధి చెప్పిన విధానాన్ని రష్మిక ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. మరోవైపు రష్మిక ఈ సినిమాతో పాటు పుష్ప సినిమాలో కూడా నటిస్తున్నారు.

పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్రలో రష్మిక డీగ్లామర్ లుక్ లో కనిపించనున్నారు. రష్మిక చేతిలో హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. రష్మిక నటిస్తున్న బాలీవుడ్ సినిమాలు సక్సెస్ సాధిస్తే రష్మిక బాలీవుడ్ కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. రష్మిక నటిస్తున్న సినిమాల కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను అభిమానులతో పంచుకుంటున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.