సీనియర్ స్టార్ హీరోలలో కొంతమంది హీరోలు వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటుంటే మరి కొందరు హీరోలు మాత్రం మూడు పదుల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోయిన్లతో కలిసి నటించడం గమనార్హం. హీరోహీరోయిన్ల ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో సైతం జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం. ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరైన రత్న పాఠక్ షా తాజాగా సీనియర్ హీరోలు కూతురు వయస్సున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ విధంగా నటించడం గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని (Ratna Pathak) ఆమె అన్నారు. కూతురు వయస్సున్న హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి వారికి ఏ మాత్రం సిగ్గుగా అనిపించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు నేను మాత్రం ఏం మాట్లడగలనని రత్నపాఠక్ షా ప్రశ్నించారు. నేను చెప్పడానికి ఏం లేదని దీని గురించి మాట్లాడటం నాకే సిగ్గుగా ఉందని రత్న పాఠక్ షా పేర్కొన్నారు.
అయితే కచ్చితంగా ఏదో ఒకరోజు మార్పు వస్తుందని ఆమె అన్నారు. ఆడవాళ్లు నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని రత్న పాఠక్ షా వెల్లడించారు. వాళ్లు సినిమా ఇండస్ట్రీలో కూడా అద్భుతాలు చేయగలరని ఆమె పేర్కొన్నారు. దీనికి కొంత సమయం పడుతుందేమో కానీ తప్పకుండా జరిగి తీరుతూందని రత్న పాఠక్ షా వెల్లడించారు. ధక్ ధక్ మూవీ ప్రమోషన్స్ లో రత్న పాఠక్ షా ఈ కామెంట్లు చేశారు.
అయితే హీరోయిన్లు మాత్రం సీనియర్ హీరోలతో రొమాన్స్ చేయడానికి తమకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకని చెబుతున్నారు. రత్న పాఠక్ షా కామెంట్ల గురించి స్టార్ హీరోయిన్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కొంతమంది హీరోయిన్లు మాత్రం సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.