ఎలాంటి బ్యాగ్రౌండ్, స్పోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న అతి తక్కువమంది కథానాయకుల్లో రవితేజ ఒకరు. చిరంజీవి తర్వాత ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచినవాళ్లలో రవితేజ ప్రప్రధముడు. అలాంటి రవితేజ యాటిట్యూడ్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీ మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. తాను వ్యక్తిగా ఎదిగినా కూడా స్నేహితులను ఎప్పుడు దూరం పెట్టలేదని.. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే రోజుల్ని రవితేజ ఎప్పటికీ మర్చిపోడని అతడి స్నేహితులు కూడా ఒకటికిపదిసార్లు చెబుతుంటారు.
అలాంటి రవితేజ ఈమధ్యకాలంలో బాగా మారిపోయాడని తెలుస్తోంది. తమ్ముడి మరణం కావచ్చు లేదా వరుస పరాజయాలు కావచ్చు రవితేజలో చాలా మార్పులు తీసుకొచ్చిందట. ఆ మార్పు స్క్రిప్ట్ సెలక్షన్ పరంగా అయితే అందరూ ఆనందించేవాళ్లు. కానీ.. ఆయన అలా చేయకుండా తన స్నేహితులని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. తనకి బాలా క్లోజ్ అయిన బి.బి.ఎస్.రవి, హరీష్ శంకర్, మెహర్ రమేష్, ఉత్తేజ్ వంటి వారిని కూడా కలవడం మానేశాడట. మరి “డిస్కో రాజా” విడుదలయ్యాక తన మిత్రబృందాన్ని మళ్ళీ దగ్గరకు చేర్చుకుంటాడేమో చూడాలి.