మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మంచి జోష్‌లో వున్నారు. గతేడాది క్రాక్ సినిమాతో అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఆ వెంటనే వరుసపెట్టి సినిమాలను లైన్‌లో పెట్టేశారు. ఆయన చేతిలో అరడజను సినిమాలు వున్నాయి. వీటిలో రెండు సినిమాల షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఖిలాడి మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో మాస్ మహారాజా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు.
వీర సినిమా తర్వాత ఎన్నో ఏళ్లకి వస్తున్న సినిమా కావడంతో ఖిలాడీపై భారీ అంచనాలున్నాయి. ఇక శరత్ మండవ తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ముగింపు దశకు చేరుకుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’మూవీని అనౌన్స్ చేశారు.
ఆయన కెరీర్‌లొ ఇది 70వ చిత్రం. అంతేకాదు ఈ మూవీలో రవితేజ న్యాయవాదిగా కనిపించనుండగా… సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు ‘ధమాకా’.డబుల్ ఇంపాక్ట్ అనే మూవీ కూడా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ నాలుగు చిత్రాలతో పాటు ఓ బయోపిక్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. అదే ‘టైగర్ నాగేశ్వరరావు’. ఒకప్పుడు స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజ్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు.
తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు దాదాపు 20 ఏళ్ల తర్వాత మరోసారి మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పెంచుకునే అవకాశం రవితేజకి వచ్చింది. చిరు హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారాయన. ఇలా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రవితేజ అన్ని సినిమాలు కలిపి దాదాపు రూ. 300 కోట్ల మేర బిజినెస్ జరగనుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అంతేకాదు ఒక్కో సినిమాకు ఎంత లేదన్నా రూ.12 కోట్ల చొప్పున.. ఆరు సినిమాలకు గాను రూ. 72 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నారని ఫిలింనగర్ టాక్.