టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ ప్రాఫిట్స్ ఉండేవి. అందుకే గతంలో ఏడాదికి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండేవారు. రెమ్యునరేషన్ విషయంలో కూడా బెట్టు చేయకుండా న్యాయం ప్రకారమే తీసుకుంటారు. ఇక గత సినిమాల ప్రభావం ఇటీవల రెమ్యునరేషన్ పై కొంత పడింది. రాజా ది గ్రేట్ అనంతరం మాస్ రాజా చాలా వరకు డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు. అయితే రవితేజ ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు.
మిగతా హీరోల మాదిరిగా ఇతర ఏరియాల రైట్స్ వంటివి కూడా తీసుకోలేదు. అయితే మొదటిసారి క్రాక్ సినిమాకు అలా చేయక తప్పలేదు. పారితోషికం తీసుకోకుండా నైజాం, వైజాగ్ ఏరియా హక్కులను తీసుకున్నాడు. ఇక నైజాంలో ఇప్పటికే 6కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్న క్రాక్ వైజాగ్ లో రూ3.5కోట్లను అందుకున్నట్లు సమాచారం. ఆ విధంగా ఇప్పటికే ఆ సంఖ్య 10కోట్ల దగ్గరకు రానున్నట్లు అర్ధమయ్యింది.
ఇక ఇటీవల వచ్చిన సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోకపోవడం క్రాక్ కు కలిసొచ్చే అంశం. మరి సినిమా ఇంకెంత లాభాలను అందిస్తుందో చూడాలి. ఒక విధంగా రెమ్యునరేషన్ కంటే రవితేజకు ఎక్కువ లాభం వచ్చినట్లు చెప్పవచ్చు.