మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC16 (RC16 Movie) సినిమాపై అంచనాలు రోజురోజుకీ మరింత పెరిగిపోతున్నాయి. ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్‌తో చరణ్ కోసం ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారని టాక్. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు టైటిల్ ఏంటన్నదాని గురించి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
కానీ, మెగా అభిమానులకు ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటివరకు పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ, మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ ఏదీ రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు, మార్చి 27 నాడు RC16 టైటిల్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందట. అంతేకాదు, టీజర్ రిలీజ్ డేట్‌కి సంబంధించి కూడా ఒక స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఇప్పటివరకు ఉన్న టైటిల్ కన్ఫ్యూజన్ కూడా తీరిపోనుంది.
టైటిల్ గ్లింప్స్ ద్వారా సినిమా కాన్సెప్ట్, మూడ్, క్యారెక్టరైజేషన్‌లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన హింట్స్ మేకర్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), జగపతిబాబు (Jagapathi Babu) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ కోసం రత్నవేలు (R. Rathnavelu), సంగీతం కోసం ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) వంటి భారీ టెక్నీషియన్ టీమ్ వర్క్ చేస్తోంది. బుచ్చిబాబు తన మార్క్ ఎమోషన్, కమర్షియల్ మాస్ యాక్షన్ మిక్స్ చేస్తూ రామ్ చరణ్ అభిమానులకు పక్కా ఫీస్ట్ అందించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే విభిన్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచేలా బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారని టాక్. టీజర్ రిలీజ్‌పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు టీజర్ గ్లింప్స్ కూడా వదిలే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి, మెగా అభిమానులు ఎదురుచూస్తున్న టైటిల్, టీజర్ అప్‌డేట్ ఎంతవరకు వారి అంచనాలను అందుకుంటుందో చూడాలి.