విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్3’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శిరీష్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అలీ, సోనాల్ చౌహాన్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మే 27న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడ్డానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) 2022 లో వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ సీరియస్ మోడ్ లో సాగిన సినిమాలే. ఈ సమ్మర్ కు కడుపుబ్బా నవ్వించే సినిమా రాలేదు. కాబట్టి ‘ఎఫ్3’ మూవీ ఆ లోటుని తీర్చే అవకాశాలు ఉన్నాయి.
2) ‘ఎఫ్3’ కచ్చితంగా చూడాలనుకోవడానికి ‘ఎఫ్2’ మూవీని కూడా ఓ కారణంగా చెప్పుకోవాలి. 2019 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం మొదటి నుండీ ధీమాగా చెబుతుంది.
3)సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ అనే విధంగా ఉంటాయి. ‘ఎఫ్2’ బ్లాక్ బస్టర్ అవ్వడానికి దిల్ రాజు బ్రాండ్ కూడా తోడయ్యింది. ఈసారి కూడా ఆ ఫీట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది.
4) దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పటి వరకు తెరకెక్కించిన 5 సినిమాలు ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరు’ అన్నీ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ మూవీతో అతను హిట్టు కొట్టి డబుల్ హ్యాట్రిక్ ను కంప్లీట్ చేస్తాడని అంతా భావిస్తున్నారు.
5) తమన్నా గ్లామర్ కూడా ‘ఎఫ్3’ కి హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘ఎఫ్2’ లో ఆమె బికినీలో అందాలు వడ్డించింది.
6) మెహ్రీన్ ‘ఎఫ్2’ లో చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఫస్ట్ హాఫ్ అంత హిలేరియస్ గా వచ్చింది అంటే ఈమె కామెడీ కూడా ఓ కారణం అని చెప్పాలి. ‘ఎఫ్3’ లో కూడా ఈమె కామెడీ ట్రాక్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
7) ‘ఎఫ్2 లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కామెడీ కూడా బాగా పండింది. ‘ఎంతుంటే అంత’ అంటూ ఈమె చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ‘ఎఫ్3’ లో కూడా ఈమె కామెడీ ట్రాక్ హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
8) విక్టరీ వెంకటేష్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు అన్నీ దాదాపు సక్సెస్ అయినవే. కామెడీ ట్రాక్ ఉంటే కనుక అతను విశ్వరూపం చూపిస్తూ ఉంటాడు. ఈ మూవీలో రేచీకటితో బాధపడే వ్యక్తిగా అతను కనిపించబోతున్నాడు. ఇలాంటి పాత్ర దొరికితే వెంకీ చెలరేగి పోవడం ఖాయం.
9) వరుణ్ తేజ్.. హానెస్ట్ పెర్ఫార్మర్. ఈ మూవీలో అతను నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ‘ఎఫ్2’ కంటే కూడా ‘ఎఫ్3’ లో అతను సన్నగా మరింత గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఇతని పాత్ర కూడా హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
10) సునీల్ కు రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సరైన సినిమా పడలేదు. అతనికి ఈసారి ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ దొరికింది. ‘ఎఫ్2’ లో ఇతని పాత్ర లేదు. ‘ఎఫ్3’ లో యాడ్ చేశారు. ఇందులో అతని పాత్ర అద్భుతంగా వచ్చిందని టాక్. ‘ఎఫ్3’ ఇతనికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టే మూవీ అవుతుందని అంతా భావిస్తున్నారు.
11) పూజా హెగ్డే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇటీవల విడుదలైన ఆ సాంగ్ కు సంబంధించిన ప్రోమోస్ అన్నీ బాగున్నాయి. ‘ఎఫ్3’ లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ కూడా హైలెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.