పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్'(The RajaSaab) చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

ప్రభాస్ : డౌట్ లేకుండా ఈ సినిమా కోసం థియేటర్ కి వెళ్లే ప్రేక్షకుల్లో మెజారిటీ పర్సెంటేజ్ ప్రభాస్ కోసమే వెళ్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘ది రాజాసాబ్’ లో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారు’ అని దర్శకుడు మారుతీ మొదటి నుండి హైప్ ఇచ్చాడు. ప్రమోషనల్ కంటెంట్ లో కూడా ప్రభాస్ లుక్స్ బాగున్నాయి.’బుజ్జిగాడు’ స్టైల్లో కామెడీ కూడా పండించాడు అని టీజర్, ట్రైలర్స్ తో క్లారిటీ వచ్చింది. అలాగే జోకర్ గెటప్, ఓల్డ్ మెన్ గెటప్..లు కూడా వేశాడు. సో ప్రభాస్ ఈ సినిమాకి యూ.ఎస్.పి అనడంలో సందేహం లేదు.
హారర్ ఫాంటసీ : మొదట ఈ సినిమాని ‘హారర్ కామెడీ’ జోనర్ మూవీగా మొదలుపెట్టారట. కానీ తర్వాత ప్రభాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని.. దీన్ని ‘హారర్ ఫాంటసీ’ జోనర్ కి మార్చినట్టు కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు. అయినప్పటికీ హారర్ ఎలిమెంట్స్ కనుక క్లిక్ అయితే మిగతా బాధ్యత అంతా ఆడియన్స్ తీసుకుంటారు.
విజువల్ ఫీస్ట్ : ఇలాంటి సినిమాలకు వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ అనేది చాలా కీలకమైనది. కేవలం దాని కోసమే మేకర్స్ గతేడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని.. వాయిదా వేసి చాలా టైం స్పెండ్ చేశారు. టీజర్, ట్రైలర్స్ లో వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెప్పారు. సో అవి కనుక సినిమాలో బాగుంటే.. కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడటానికి ఎగబడతారు అనడంలో సందేహం లేదు.
ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ : ‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటి సినిమాల్లో ప్రభాస్ కి హీరోయిన్ లేదు. సో ఫ్యాన్స్ లో ముఖ్యంగా మాస్ అభిమానులకు కూడా ఆలోటు ఒకరు ఉండిపోయింది. దానిని ‘ది రాజాసాబ్’ తీరుస్తుంది అని భావిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి భామలు నటించారు. వాళ్ళ గ్లామర్ కచ్చితంగా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉంది.
సంజయ్ దత్ : బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటించాడు అంటే.. ఆ సినిమా రేంజ్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమాలో ఆయన శాస్త్రవేత్తగా,తాంత్రికుడిగా రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో కనిపించనున్నారు. ఆయన క్యారెక్టర్ ఈ సినిమాకి చాలా కీలకం అని అంటున్నారు. ఈయన పాత్ర సినిమాపై ఆసక్తి కలిగించింది అని చెప్పాలి.
తమన్ : ‘ది రాజాసాబ్’ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకమట. అందుకే సాంగ్స్ కంటే బీజీఎం చాలా ముఖ్యమని భావించి అతన్ని తీసుకున్నారు. హారర్ ఎలిమెంట్స్ కి తమన్ అందించిన స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. సెకండ్ ట్రైలర్ కి ఇతని అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.
జరీనా వాహాబ్ : ఈ సినిమాలో ఆమె నాయనమ్మ పాత్ర పోషించారు. ఆడియన్స్ అంతా కచ్చితంగా ఈ పాత్రతో కనెక్ట్ అవుతారని మేకర్స్ బలంగా చెబుతున్నారు. యువరాణి గంగాదేవిగా కూడా ఈమె కనిపించనున్నారు. సినిమాకి సోల్ ఈ పాత్ర అని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అంటున్నారు.
క్లైమాక్స్ కూడా సినిమాకి ఆయువు పట్టు అంటున్నారు. ‘క్లైమాక్స్ పెన్ తో రాసావా.. మిషన్ గన్ తో రాసావా’ అంటూ స్వయంగా ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ పలకడం జరిగింది. ఆ కామెంట్స్ కూడా హైప్ పెంచాయి.
నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ ఈ సినిమాని దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సినిమా కోసం భారీ భారీ సెట్స్ వేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే భారీగా ఖర్చు పెట్టారు అంటే అర్ధం చేసుకోవచ్చు.
