నందమూరి బాలకృష్ణ తన తండ్రి, దివంగత నేత అయిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్ర ఆడియో వేడుకను ఈరోజు హైదరాబాద్ ఫిలింనగర్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజే ‘ఎన్టీఆర్- కథానాయకుడు’ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ వర్మ.. ‘నేను కూడా ‘ఎన్టీఆర్ బయోపిక్’ తీస్తున్నాను అంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.
తాజాగా ఈ చిత్రంలోని ‘వెన్నుపోటు’ అనే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. అసలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను ప్రమోట్ చేయడం కోసం ఇలా చేస్తున్నాడా లేక కావాలనే ‘ఎన్టీఆర్-కధానాయకుడు’ ట్రైలర్’ కు కౌంటర్ ఇచ్చేందుకు ఇలా చేస్తున్నాడా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడా అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే తాజాగా వెన్నుపోటు సాంగ్ కూడా ప్రమోషన్ కావాలనుకున్నాడేమో .. నందమూరి బాలకృష్ణ వాయిస్ ను మిమిక్రీ చేయించి ఒక వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు.
అయితే ఆ వీడియోని పోస్ట్ చేస్తూ రాంగోపాల్ వర్మ … ‘నేను ఈ వీడియో ని తయారు చేయించలేదు’ అంటూ దాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు.ఇదిలా ఉంటే ఈ వీడియో చూసిన ఎవరికైనా అది వర్మ చీప్ ట్రిక్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో వర్మ వాయిస్ మాత్రం అలాగే ఉండడం గమనార్హం. అంతేకాకుండా వర్మ రాసిన స్క్రిప్ట్ అది అని కూడా తెలిసిపోతోంది. కేవలం నందమూరి అభిమానులనో.. లేక..బాలకృష్ణనో రెచ్చగొట్టి దాన్ని పబ్లిసిటీ గా మార్చుకునేందుకు వర్మ ఇలా ‘ఎన్టీఆర్- కథానాయకుడు’ టీం ని దిస్తుర్బ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ముందు.. ముందు.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.