దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం గతేడాది మార్చి 25 న రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. గత ఏడాది ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1140 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ను ఈ మూవీ అధిగమించలేకపోయింది
కానీ మొత్తంగా కోవిడ్ తర్వాత ఆ స్థాయిలో కలెక్ట్ చేసిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.1240 కోట్లకు పైనే వసూళ్లు సాధించి ‘ఆర్.ఆర్.ఆర్’ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ గత ఏడాది చివర్లోనే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జపాన్ లో రిలీజ్ అవ్వడం జరిగింది.
అక్కడ రిలీజ్ అయ్యి ఏడాది కావస్తున్నా ఇంకా భారీ కలెక్షన్స్ ను రాబడుతూ చరిత్ర సృష్టిస్తుంది. ఆల్రెడీ అక్కడి కలెక్షన్స్ తో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ వసూళ్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ అక్కడి లేటెస్ట్ కలెక్షన్స్ తో కలుపుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ మొత్తంగా రూ.1300 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకున్నట్టు సమాచారం.
‘బాహుబలి 2 ‘ కలెక్షన్స్ ని అందుకునే అవకాశాలు లేకపోయినా తెలుగు సినిమాల్లో ఇది మంచి ఫీట్ అనే చెప్పాలి. ఆస్కార్ వచ్చి చాలా కాలం అయినా ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.