Harish Shankar , Ram: హరీష్ నోట రామ్ సినిమా ప్రస్తావన రాలేదుగా.. గమనించారా
- September 1, 2024 / 01:48 PM ISTByFilmy Focus
హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమా ఇటీవల అంటే ఆగస్టు 15న రిలీజ్ అయ్యి ప్లాప్ గా మిగిలింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా రామ్ తో (Ram) ఉంటుందని.. ‘అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తారని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. కాబట్టి.. ఆగస్టు 15నే విడుదల కాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు హరీష్ శంకర్ తెలిపాడు.
Harish Shankar , Ram

కానీ దురదృష్టవశాత్తు ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్లాప్ అయ్యింది. కాబట్టి.. హరీష్ శంకర్- రామ్..ల సినిమా ఆగిపోయింది అనే వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ దీనిపై హరీష్ కానీ, రామ్ కానీ, నిర్మాత కానీ.. స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే ఈరోజు జరిగిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో.. తన నెక్స్ట్ సినిమా గురించి హరీష్ శంకర్ కి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి అతను ”ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుందని,

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు వరుసగా తన నెక్స్ట్ సినిమాలకి డేట్స్ ఇస్తున్న క్రమంలో.. ‘ఉస్తాద్..’ కి కూడా డేట్స్ ఇస్తారని ఎదురుచూస్తున్నట్టు’ హరీష్ శంకర్ తెలిపాడు. కానీ రామ్ సినిమా గురించి అతను స్పందించింది లేదు. సో దీన్ని బట్టి.. హరీష్ – రామ్..ల సినిమా ఆగిపోయి ఉండొచ్చు అని అంతా అభిప్రాయపడుతున్నారు. చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.

‘మనం సినిమా చేస్తే ‘ఫ్యాన్ 5 లో తిరగాలి కానీ 2 లో తిరగకూడదు’ అని రామ్ ఓ సందర్భంలో హరీష్ తో చెప్పాడట. దీంతో ‘ఫ్యాన్ 5 లో తిరిగే కథ రామ్ కి చెప్పినట్టు’ హరీష్ ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్ లో చెప్పాడు. బహుశా పవర్ ఆగిపోవడం వల్ల అనుకుంట.. వీళ్ళ ఫ్యాన్ కూడా ఆగిపోయినట్టు ఉంది.














