Sai Pallavi: మనస్సులోని మాటను బయటపెట్టిన సాయిపల్లవి?

స్టార్ హీరోయిన్ సాయిపల్లవికి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో భారీగా స్థాయిలో క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిచయం లేదు. తెలుగులో సాయిపల్లవి తక్కువ సినిమాల్లోనే నటించినా ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సాయిపల్లవి ఖాతాలో వేసుకున్నారు. సాయిపల్లవి నటించిన విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ సినిమాలు త్వరలో రిలీజ్ కానుండగా ఈ సినిమాలపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు రాకపోయినా వచ్చిన ఆఫర్లతోనే సాయిపల్లవి సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతుండటం గమనార్హం.

అయితే తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన సాయిపల్లవి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. కామెడీ పాత్రల్లో నటించాలని ఉందని సాయిపల్లవి అభిమానులకు చెప్పడం గమనార్హం. మనస్సులోని మాటను బయటపెట్టిన సాయిపల్లవికి అలాంటి పాత్రలను ఏ డైరెక్టర్ ఆఫర్ చేస్తారో చూడాల్సి ఉంది. నటిగా విభిన్నమైన పాత్రలను పోషించాలని ఆశ పడుతున్న సాయిపల్లవి కామెడీ రోల్స్ పై మనస్సు పారేసుకున్నారని అర్థమవుతోంది. సినిమాసినిమాకు సాయిపల్లవికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా స్టార్ డైరెక్టర్లు సాయిపల్లవికి తమ సినిమాల్లో హీరోయిన్ రోల్స్ ఆఫర్ చేస్తే పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సాయిపల్లవికి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. లవ్ స్టోరీ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి సాయిపల్లవి ఒక కారణమని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నటిగా సాయిపల్లవి పేరుప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో సైతం సాయిపల్లవికి భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus