Sai Pallavi: సాయి పల్లవి సమస్య విని.. అయ్యో పాపం అంటున్న జనాలు!

పాత్ర ఏదైనా ఇట్టే చేసేసి ప్రేక్షకుల చేత శబాష్ ,అనిపించుకుంది ఈ భామ. ఇక సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసింది అందాల ముద్దుగమ్మ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్ మైరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఈ అమ్మడు కోసమే సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల సాయి పల్లవి.

కెరీర్ ఆరంభం నుంచి ఆమె మేకప్ కు దూరంగా ఉండానికి ఒక బలమైన కారణం ఉందట. సాయి పల్లవి పలు చర్మ సమస్యలతో బాధపడుతుందని టాక్ వుంది. మేకప్ ఉత్పతులను వాడితే ఆమె చర్మంపై ర్యాషెస్, తీవ్రమైన దురద వంటి సమస్యలు వస్తాయట. పైగా మొదటి నుంచి ఆమెకు అసలు మేకప్ వేసుకునే అలవాటు లేదట. తొలి చిత్రం ప్రేమమ్లోనూ మేకప్ వేసుకోకుండానే నటించింది. అయితే ఆ టైమ్ లో తన అందంపై సాయి పల్లవి ఎంతో టెన్షన్ పడింది.

కానీ, ప్రేక్షకులు ఆమెను బాగా రిసీవ్ చేసుకున్నారు. దాంతో సాయి పల్లవి తనకు మేకప్ అవసరం లేదని అప్పుడే డిసైడ్ అయిందట. సాయి పల్లవి చాలా స్పెషల్. అందాల ఆరబోతకు ఆమడదూరంగా వుంటుంది. అందుకే ఈమెకి తెలుగునాట చేలా ప్రత్యేకమైన పేరు ఉంటుంది.

హీరోలకి మల్లె (Sai Pallavi)ఆమెకి ఇక్కడ అభిమాన సంఘాలు వున్నాయంటే మీరు నమ్ముతారా? ఆమె ఎక్కడ కనబడినా లేడీ పవర్ స్టార్ అంటూ ఆమెని పిలుస్తూ వుంటారు. అంతలా సాయి పల్లవి ఇక్కడ పేరు తెచ్చుకున్నారు. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్లోనూ చాలా పద్ధతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈ క్రమంలో కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus