టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న ప్రభాస్ తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీఇన్నీ కావు. ప్రభాస్ సినిమా అంటే 300 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలు నష్టాలు మిగిల్చిన సందర్భాలు తక్కువనే సంగతి తెలిసిందే. తాజాగా విదేశాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
యూఎస్ లోని కొన్ని లొకేషన్స్ లో ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు 50,000 డాలర్లను దాటడం గమనార్హం. ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
కేజీఎఫ్2 సినిమాను మించి ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సలార్ సినిమా విషయంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మాతల ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. బాహుబలి2 సినిమాను మించి ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ అందించడం గమనార్హం.
ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా (Salaar) సలార్1, సలార్2 సినిమాలు మామూలుగా ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సలార్2 విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.