ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం. సలార్ మూవీ థియేటర్లలో రిలీజైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కొరకు ప్రముఖ ఓటీటీ సంస్థ 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సమాచారం.
సలార్ సినిమాకు డిజిటల్ హక్కుల ద్వారానే సగం బడ్జెట్ రికవరీ కావడం గమనార్హం. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సలార్ మూవీ కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. కళ్లు చెదిరే రేటుకు సలార్ డిజిటల్ హక్కులు అమ్ముడవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
సలార్ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అని సమాచారం. తెలుగుతో పాటు కన్నడ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా డబ్ కానుందని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. సలార్ సినిమాతో ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఏడాదే సలార్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతున్నా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని సమాచారం. మాస్ కథాంశంతో సలార్ మూవీ తెరకెక్కుతోంది. రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడిగా ప్రశాంత్ నీల్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. సినిమాసినిమాకు ప్రశాంత్ నీల్ కు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.