Samantha: సిక్స్ ప్యాక్ కోసం సమంత హార్డ్ వర్కౌట్స్ చూశారా..!

కొద్ది రోజుల క్రితం వరకు స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏదైనా న్యూస్ వస్తే.. ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు షాక్ అయ్యేవారు.. మయోసైటిస్‌కి గురై విశ్రాంతి తీసుకుంటున్న సామ్ ఆరోగ్యం గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కంగారు.. బెడ్ మీద ఉండే తను నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ‘యశోద’ డబ్బింగ్ కంప్లీట్ చేసింది.. ‘శాకుంతలం’ కి కూడా అదే పరిస్థితి.. ‘ఖుషి’ వాయిదా పడింది.. కొత్త సినిమాల విషయంలో క్లారిటీ లేదు..

ఇదంతా కొద్ది రోజుల క్రితం ముచ్చట.. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, ఎనర్జీగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది సమంత.. ఇటీవల బాలీవుడ్‌లో ‘ఫ్యామిలీ మెన్ 2’ తర్వాత చేయనున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం బాంబే వెళ్లొచ్చింది.. ఫస్ట్ కాపీ రెడీ అవగానే ‘శాకుంతలం’ సినిమా చూసి.. విజయం పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చింది.. అలాగే చిత్రం బాగా ఆడాలంటూ జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో జరిపించిన ప్రత్యేక పూజలో పాల్గొంది.. ‘ఖుషి’ బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసే పనిలో పడింది కూడా..

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటుంది సమంత.. తన వర్కౌట్ పిక్స్, వీడియోస్ చూస్తే.. హెల్త్, ఫిట్‌నెస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమవుతోంది.. రీసెంట్‌గా కఠినమైన ఆసనాలు వేస్తూ కనిపించింది.. దీంతో సామ్ సిక్స్ ప్యాక్ చేయబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.. దానికి రీజన్ ఏంటంటే.. సామ్ పోస్ట్ చేసిన ఫోటోలో యాబ్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి..

దీంతో ‘సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నారా సమంత?.. కొత్త సినిమా కోసమా.. లేక వెబ్ సిరీస్‌లో క్యారెక్టర్ కోసమా?’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం సామ్ వర్కౌట్ పిక్ వైరల్ అవుతోంది.. గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ప్రెస్టీజియస్ హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.. తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో ‘ఖుషి’ కూడా రానుంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus