14 ఏళ్ల సినీ కెరీర్.. స్టార్ హీరోయిన్‌గా ఆమె చూడని విజయాలు లేవు. అయితే ఒక్కసారిగా ఆమె జీవితం తల కిందులు అయిపోయింది. ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో, అటు పర్సనల్ లైఫ్‌లో చాలా ఇబ్బందులు చూసింది. ఈలోపు ఆరోగ్య పరమైన ఇబ్బందులు వచ్చాయి. అయితే వీటన్నింటిని దాటుకుని తానో సూపర్ ఉమన్ అని నిరూపించింది. ఆమెనే సమంత. యాక్టింగ్ నుండి ప్రస్తుతంం విరామంలో ఉన్న (Samantha) సామ్… ఇటీవల ఓ కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పింది. దాంతోపాటు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కూడా ప్రస్తావించింది.
14 ఏళ్ల కెరీర్‌లో రోజూ 10 రకాల పనులు చేసేదానినని, ఐదు గంటలు మాత్రమే నిద్రపోయిన సందర్భాలున్నాయి అని చెప్పింది సమంత. ఆ సమయంలో శరీరం, మనసుకు ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో ఇబ్బందిపడ్డాను. ఆ సమస్య కారణంగా కెరీర్ అగ్రస్థానంలో ఉన్నప్పుడు ఆ విజయ క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయానని తెలిపింది. ఆ తర్వాత మయోసైటిస్ రుగ్మత భారిన పడ్డానని చెప్పుకొచ్చింది సామ్.
ఆ రుగ్మత ఉందని తెలిసినప్పటికి ‘యశోద’ (Yashoda) సినిమా పూర్తయిందని, అయితే ఇబ్బంది కారణంగా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పింది సామ్. అయితే ప్రచారం చేయకపోతే ఆ సినిమా చనిపోయేలా ఉందని నిర్మాత చెప్పడంతో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చానని సమంత తెలిసింది. తన రుగ్మత గురించి ఎవరికీ చెప్పకూడదు అని అనుకున్నా… అప్పటి పరిస్థితుల రీత్యా ఆ రుగ్మత ఉందని బయటకు చెప్పాల్సి వచ్చిందని సమంత తెలిపింది.
రుగ్మత గురించి బయట పెట్టని సమయంలో తనపై చాలా రూమర్లు వచ్చాయని కూడా సామ్ చెప్పింది. అలా తన కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు పూర్తిగా ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోయానని బాధపడింది సమంత. ‘సిటడెల్’ వెబ్ సిరీస్‌తో సమంత త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. కొత్త సినిమాల విషయంలో చాలా పుకార్లు వస్తున్నా ఇంకా ఏదీ ఫైనల్ అవ్వలేదు. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.