Samantha: ఇక్కడి నుండే వచ్చింది.. నాకు నేర్పించలేదు: సమంత ఫిర్యాదు!

సమంత తమిళనాడు పుట్టి పెరిగి.. కేరళ మూలాలు ఉన్న హీరోయిన్‌. తమిళంలో అనర్గళంగా మాట్లాడే సామ్‌.. తెలుగులో కూడా బాగానే మాట్లాడుతుంది. అయితే మలయాళం మాత్రం రాదు. దీనికి కారణం ఆమె అమ్మనే. ఈ విషయాన్ని సమంతనే చెప్పింది. అంతేకాదు ఆమె మీద ఏకంగా ఫిర్యాదు చేసింది. ‘మా అమ్మ ఊరు ఇదే.. కానీ నాకు మలయాళం నేర్పించలేదు’ అంటూ మీడియా ఎదుటే అని నవ్వేసింది సమంత. ఇంతకీ ఏం జరిగింది అంటే…

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ సినిమా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారం కోసం ఇటీవల సామ్‌.. కేరళవెళ్లింది. అప్పుడే తన మలయాళం సంగతి గురించి చెప్పుకొచ్చింది. ‘‘మా అమ్మది కేరళనే. కానీ ఇంట్లో ఒక్క ముక్క కూడా నాకు మలయాళం నేర్పలేదు. అందుకే స్పష్టంగా మలయాళంలో మాట్లాడటం లేదు’’ అని చెప్పింది సమంత.

‘శాకుంతలం’ సినిమాలో సమంతకు (Samantha) జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. కేరళ కుర్రాడు కాబట్టి అతను మలయాళంలో బాగా మాట్లాడాడు. దీంతో అతని సాయం తీసుకున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. తీసుకున్నట్లు సమంత చెప్పింది. దేవ్ మోహన్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో ఎలా మాట్లాడాలో నేర్పించానని, ఇప్పుడు మలయాళం గురించి అడిగానని సమంత చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు మలయాళంలో సినిమా చేసే అవకాశం వస్తే కచ్చితంగా మలయాళం నేర్చుకుంటానని సమంత అంటోంది.

డబ్బింగ్ కూడా చెబుతానని చెబుతోంది. అయితే మరేదైనా మలయాళం సినిమాలో ఛాన్స్‌ వచ్చిందేమో అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. లేకపోతే మలయాళం ఛాన్స్‌ గురించి సమంత ఎందుకు మాట్లాడుతుంది అనే చర్చ లేవనెత్తుతున్నారు. సమంత ఇటీవల కాలంలో చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తోంది. టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్‌లతో బాలీవుడ్‌వైపు వెళ్లింది. ఇప్పుడు నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం మాలీవుడ్‌ వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus