Samantha: నెటిజన్ షాకింగ్ రిక్వెస్ట్.. సమంత రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత (Samantha) ఏ ప్రాజెక్ట్ లో నటించినా ఆ ప్రాజెక్ట్ లో తన నటన స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే మరికొన్ని రోజుల్లో సమంత నటించిన శాకుంతలం సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా సమంత ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. మరోవైపు సమంత ఖుషి సినిమా షూట్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా టక్ జగదీష్ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంతకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా సమంత ఆ ప్రచారాన్ని ఖండించిన సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం సింగిల్ గా ఉండటానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

అయితే నాకు తెలుసు అది నా స్థానం కాదని.. ప్లీజ్ సామ్.. మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ తాజాగా ఒక నెటిజన్ సలహా ఇచ్చారు. ఈ సలహాకు సంబంధించిన కామెంట్ కు సమంత స్పందిస్తూ మీలాగే నన్ను ఎవరు ప్రేమిస్తారు అంటూ హార్ట్ సింబల్ ను షేర్ చేయడం జరిగింది. సమంత స్పందనకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. అభిమానుల విషయంలో సమంత ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారు.

బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్ ను మొదలుపెట్టిన సమంత తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. సమంత ఒక్కో ప్రాజెక్ట్ కు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus