Samantha: సమంత, ఆ స్టార్ హీరోతో కలిసి కేరళ ఎందుకు వెళ్లిందంటే..?

  • March 31, 2023 / 05:24 PM IST

స్టార్ హీరోయిన్ సమంత కొద్ది కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది.. ఆమె పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా చాలా త్వరగా వైరల్ అయిపోతుంటుంది.. ఎప్పుడైతే మయోసైటిస్ బారిన పడ్డానని వెల్లడించిందో అప్పటినుండి రకరకాల వార్తలు వచ్చాయి.. విశ్రాంతి తీసుకుంటూనే ‘యశోద’, ‘శాకుంతలం’ డబ్బింగ్ పూర్తి చేసి.. సినిమా అంటే తనకెంత ప్యాషన్, డెడికేషన్ అనేది తెలియజేసిందామె. కాస్త గ్యాప్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది సామ్.. బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’, విజయ్ దేవరకొండ ‘ఖుషి’, ‘శాకుంతలం’ ప్రమోషన్స్.. ఇలా ఫుల్ బిజీగా గడుపుతోంది..

సమంత, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండల క్రేజీ కాంబోలో.. ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్’ చిత్రాలతో ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ వారు నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘ఖుషి’.. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాని గతేడాది డిసెంబర్ 23న రిలీజ్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆలస్యమవడంతో కొంత కాలం గ్యాప్ వచ్చింది.. తర్వాత ఫిబ్రవరికి వాయిదా వేశారు కానీ కుదరలేదు.. ఇటీవలే సామ్ బ్యాలెన్స్ షూటింగ్ స్టార్ట్ చేసింది..

ఓ సీన్ కోసం మెళ్లో పసుపుతాడు, నల్లపూసలు వేసుకుంది సామ్.. దీన్ని ఎవరో ఫోటో తీసి నెట్‌లో పెట్టడంతో సమంత  రెండో పెళ్లి చేసుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఖుషి’ ని సెప్టెంబర్ 1న భారీగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేశారు.. దీంతో షూట్ కూడా చకచకా జరుగుతోంది.. కొత్త షెడ్యూల్ కోసం టీమ్ కేరళ వెళ్లారు.. అక్కడ బోట్‌లో వెళ్తున్న వీడియో ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది సమంత  ..

కేరళలోని కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్లలో ‘ఖుషి’ కి సంబంధించిన సీన్స్ చిత్రీకరించబోతున్నారు.. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట.. సామ్ – విజయ్ కలిసి నటిస్తున్న ఫస్ట్ ఫిలిం కావడం.. డైరెక్టర్ ట్రాక్ రికార్డ్‌ని బట్టి చూస్తే.. కచ్చితంగా విజయం సాధిస్తుందనే టాక్ వినిపిస్తోంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus