నిర్మాతగా లక్ పరీక్షించుకుంటున్న సంపత్ నంది !

దర్శకులు నిర్మాతలుగా మారడం సర్వ సాధారణం అయిపోయింది. సుకుమార్, మారుతి, సంపత్ నంది ఇలా అందరూ తమ సినిమాలు తాము తీసుకుంటూనే తమ సొంత బ్యానర్ లో నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు కూడా. విషయంలోకి వెళితే, సంపత్ నంది గుర్తు ఉన్నాడా? అదే ఏమైంది ఈవేళ అంటూ రొమ్యాంటిక్ టచ్ ఇచి మంచి హిట్ అందుకుని, వెంటనే రచ్చ సినిమాతో స్వామి భక్తి చాటుకుని పర్వాలేదు అని అనిపించుకున్నాడు. అయితే కాస్త గ్యాప్ ఇచ్చి రవితేజతో బెంగాల్ టైగర్ సినిమాను తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఆతరువాత ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడిగా కొద్దిరోజులు షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత బయటకువచ్చిన సంపత్ నంది ప్రస్తుతం గోపిచంద్ హీరోగా గౌతం నంద సినిమా చేస్తున్నాడు. అయితే ఒక పక్క దర్శకుడిగా తన పని తాను చేసుకుంటూనే, నిర్మాతగా కూడా మారి సినిమా చేస్తున్నాడు. అప్పట్లో నిర్మాతగా మారి గాలిపటం అనే సినిమాని తీసిన సంపత్ ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కాస్త గ్యాప్ తీసుకుని తన రెండో సినిమా స్టార్ట్ చేశాడు.

గాలిపటం తో ఫ్లాప్ అనుకున్నా సంపత్ ఇప్పుడు పేపర్ బోయ్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అయితే నిర్మాతగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ సినిమాను కేవల సంపత్ నంది మాత్రమే కాకుండా వెంకట్, నరసింహా కూడా భాగస్వామ్యం అవుతున్నారు అని తెలుస్తుంది.. ఇక దర్శకుడు ఎవరు అంటే…షార్ట్ ఫిల్మ్ తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ దర్శకుడిగా ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు సంపత్. ఇక జయశంకర్ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని అంటున్నారు. ఓ పక్క దర్శకుడిగా తన సినిమాలను తాను తీసుకుంటూ నిర్మాతగా ప్రతిభ గల దర్శకులకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఈ సినిమా అయినా సంపత్ కు కాసులు రాలుస్తుందో లేక ఖాళీ చేస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.