‘ఏమైంది ఈవేళ’ అనే ప్రేమ కథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది ఆ చిత్రంతో మంచి ఫలితాన్నే అందుకున్నాడు. అటు తర్వాత రాంచరణ్ తో ‘రచ్చ’ అనే చిత్రాన్ని తెరకెక్కించడం అది బ్లాక్ బస్టర్ అవ్వడంతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు సంపత్ నంది. ఓ దశలో అతనికి పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ కు ముందుగా సంపత్ నంది దర్శకుడిగా ఎంపికయ్యాడు.
కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు నుండీ అతను తప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ రవితేజతో ‘బెంగాల్ టైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి వెంటనే ఓ హిట్టు కొట్టాడు. అదే జోష్ లో గోపీచంద్ తో చేసిన ‘గౌతమ్ నంద’ ప్లాప్ అయ్యింది. టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న సంపత్ నందికి ఓ స్పీడ్ బ్రేకర్ లా అడ్డొచ్చింది ‘గౌతమ్ నంద’. అయినప్పటికీ కసితో అదే హీరోతో ‘సీటీమార్’ చేసి సక్సెస్ అందుకున్నాడు.
టికెట్ రేట్ల ఇష్యు వల్ల ఆంధ్రలో ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టలేదు కానీ ఎబౌవ్ యావరేజ్ అనే విధంగా కలెక్ట్ చేసింది. ‘సీటీమార్’ ఇచ్చిన ఉత్సాహంతో ఓ కథ రెడీ చేసుకున్నాడు సంపత్. కానీ అతనికి హీరో దొరకడం లేదు. స్టార్ హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు సైతం రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. కనీసం ఏడాది తర్వాత అయినా సినిమా చేయడానికి ఓ హీరో కావాలి కాబట్టి..
అతను బాలకృష్ణ, సాయి తేజ్ ల వెంట తిరుగుతున్నాడట. వాళ్ళు కూడా ప్రస్తుతం ఖాళీగా ఏమీ లేరు. కానీ ఒకేసారి 3 ప్రాజెక్టులు చేయడానికి ఈ హీరోలు సిద్ధంగా ఉంటారు కాబట్టి వీళ్ళే కరెక్ట్ ఛాయిస్ అని భావించి సంపత్ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది.