టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆయన అభిమానుల్ని మాత్రమే కాదు మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నాడు. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా వచ్చినప్పటికీ రేటింగ్ లు మాత్రం ఎందుకో ఎక్కువ పడలేదు. ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఏమాత్రం తగ్గలేదు. తక్కువ థియేటర్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రం బుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి.
ఇక ఈ చిత్రం 12 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
34.29 cr
సీడెడ్
14.44 cr
ఉత్తరాంధ్ర
17.61 cr
ఈస్ట్
10.42 cr
వెస్ట్
6.80 cr
కృష్ణా
8.18 cr
గుంటూరు
9.22 cr
నెల్లూరు
3.65 cr
ఏపీ+తెలంగాణ
104.61 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
8.85 cr
ఓవర్సీస్
11.41 cr
వరల్డ్ వైడ్ టోటల్
124.87 cr (share)
ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన 12 రోజులు పూర్తయ్యేసరికి 124.87 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి సూపర్ హిట్ రిపోర్ట్స్ వచ్చినా.. దాంతో తక్కువ థియేటర్స్ మాత్రమే దక్కినా.. ఈ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. బుధవారం వీక్ డే అయినప్పటికీ 1.78 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మహేష్ కు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడమే కాదు… నిన్నటితో ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా అందించింది. తొలిసారి మహేష్ ఈ ఫీట్ ను సాధించాడు. కేవలం 5 నెలల్లో సినిమాని పూర్తి చేసి… అది కూడా 2.75 రేటింగ్ తో.. మరోపక్క ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా..ఈ ఫీట్ ను సాధించడం అంటే మాటలు కాదు.