2020లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుండీ వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. టీవీల్లో కూడా రికార్డు టి.ఆర్.పి రేటింగ్ లు నమోదు చేసి దుమ్ము లేపింది. ఇక కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో.. ఓటిటి ల హవా నడిచిన సంగతి తెలిసిందే. అయితే 50శాతం సీటింగ్ ఆకుపెన్సీలతో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ..
జనాల్లో కరోనా భయం పోయి థియేటర్లకు రావడానికి టైం పడుతుంది అని భావించిన థియేటర్ యాజమాన్యాలు.. ముందుగా పాత సినిమాలు, డబ్బింగ్ సినిమాలను విడుదల చేసి.. జనాలకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని తమిళంలో డబ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రానికి అక్కడ మంచి టాకే వచ్చింది. 2వారాల పాటు అక్కడ రన్ అయిన ఈ చిత్రం రూ.73 లక్షల గ్రాస్ ను వసూల్ చేసింది. ఇక షేర్ పరంగా చూసుకుంటే రూ.42లక్షల వరకూ ఉంటుందని వినికిడి.
ఓ డబ్బింగ్ చిత్రం.. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలయ్యి అంత వసూల్ చెయ్యడమంటే మాటలు కాదు. మహేష్ బాబు సినిమాలు తమిళంలో(తెలుగు +తమిళ్ వెర్షన్లు) కూడా 2కోట్ల వరకూ షేర్ ను వసూల్ చేస్తుంటాయి. అక్కడ కూడా మహేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏదేమైనా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తమిళ సినిమాల విడుదలకు లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది.