‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న మహేష్ బాబు.. అనిల్ రావిపూడి.. డైరెక్షన్లో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో అంతకు మించిన హిట్ అందుకున్నాడు. ఇప్పటికీ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతూనే ఉంది. ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో.. యావరేజ్ రేటింగ్ లు దక్కించుకున్న ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని కామెంట్ చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఇప్పటికీ తగ్గకపోవడం విశేషం. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇప్పటికీ 600 కు పైగా థియేటర్లలో ప్రదర్శింపబడుతుండగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 480 థియేటర్లలో మాత్రమే ప్రదర్శింపబడుతోంది. అయినప్పటికీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతుండడం విశేషం.
ఇక 16 రోజులు పూర్తయ్యేసరికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
36.70 cr
సీడెడ్
14.89 cr
ఉత్తరాంధ్ర
18.64 cr
ఈస్ట్
10.85 cr
వెస్ట్
7.13 cr
కృష్ణా
8.50 cr
గుంటూరు
9.52 cr
నెల్లూరు
3.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
9.15 cr
ఓవర్సీస్
11.79 cr
వరల్డ్ వైడ్ టోటల్
131.01 cr (share)
ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 7 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రెండు వారాలు పూర్తయ్యేసరికి 131.01 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. 15 వ రోజున కూడా ఈ చిత్రం 2.26 కోట్ల పైనే షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 135 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం 210 కోట్లను వసూల్ చేసింది.