Mahesh Babu: ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ మే 12న విడుదల కాబోతుంది.’సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తుంది చిత్ర బృందం.ఇందులో భాగంగా మే 2న ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ పోస్టర్ లో మహేష్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. మహేష్ మేకోవర్ ‘పోకిరి’ రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. ఈరోజు ‘పోకిరి’ రిలీజ్ అయ్యి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం పట్ల మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నారు.

ఇక ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటుందని చిత్ర బృందం చెబుతూ వస్తోంది.తమన్ సంగీతంలో రూపొందిన పాటలకి మంచి రెస్పాన్స్ లభించింది. ‘కళావతి’ పాట యూట్యూబ్లో ఆల్రెడీ 150 మిలియన్ వ్యూస్ ను కొల్లగొట్టింది. ‘పెన్నీ’ పాట కూడా శ్రోతల్ని అలరిస్తుంది. టైటిల్ సాంగ్ కూడా పర్వాలేదు అనిపించింది.ఇక కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!
‘అమెజాన్ ప్రైమ్’ లో అత్యధిక వ్యూస్ ను నమోదు చేసిన తెలుగు సినిమాల లిస్ట్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus