ప్రముఖ భారతీయ నటులలో ఒకరైన సత్యరాజ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. శంఖం, మిర్చి, బాహుబలి, ప్రతిరోజూ పండగే మరికొన్ని సినిమాలు సత్యరాజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 200కు పైగా సినిమాలలో సత్యరాజ్ నటించగా తమిళంలో సత్యరాజ్ కు మంచి పేరుంది. పలు సినిమాలలో సత్యరాజ్ విలన్ రోల్స్ లో నటించడం గమనార్హం. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సత్యరాజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
తాను చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఇష్టం లేకుండానే నటించానని సత్యరాజ్ తెలిపారు. చెన్నై ఎక్స్ ప్రెస్ లో రోల్ కోసం చిత్రయూనిట్ మొదట నన్ను సంప్రదించిందని అయితే ఆ రోల్ తనకు గొప్పగా అనిపించలేదని ఆయన అన్నారు. షారుక్ ఖాన్ కు, డైరెక్టర్ రోహిత్ శెట్టికి తాను అదే విషయాన్ని వెల్లడించానని ఆయన కామెంట్లు చేశారు. అయితే షారుఖ్ పై ఉండే అభిమానంతో ఆ సినిమాలో నటించాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
షారుఖ్ ఖాన్ తన ఫేవరెట్ హీరోలలో ఒకరని షారుఖ్ నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే మూవీని తాను చాలాసార్లు చూశానని ఆయన తెలిపారు. ఆ సినిమాలో షారుఖ్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని సత్యరాజ్ పేర్కొన్నారు. షారుఖ్ ఖాన్ తో నటించాలనే ఆలోచనతో తాను ఆ సినిమాకు ఓకే చెప్పానని సత్యరాజ్ పేర్కొన్నారు. చెన్నై ఎక్స్ ప్రెస్ లో లోకల్ మాఫియా నాయకుడి రోల్ లో సత్యరాజ్ నటించి మెప్పించారు.
హీరోయిన్ తండ్రి రోల్ లో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో సత్యరాజ్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సత్యరాజ్ కు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తున్నాయి. బాహుబలి, బాహుబలి2 సక్సెస్ తో కట్టప్పగా సత్యరాజ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. సత్యరాజ్ మరెన్నో అద్భుతమైన పాత్రల్లో నటించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.