Seetimaarr Collections: మంచి ఓపెనింగ్స్ నే రాబట్టింది కానీ..!
- September 17, 2021 / 01:12 PM ISTByFilmy Focus
గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా… దిగంగన సూర్యవంశీ సెకండ్ హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది … ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి కానీ వీక్ డేస్ లో జోరు చూపించలేకపోయింది. పైగా టార్గెట్ కూడా పెద్దది కావడంతో ఇవి యావరేజ్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.

‘సీటీమార్’ ఫస్ట్ వీక్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
| నైజాం | 2.31 cr |
| సీడెడ్ | 1.65 cr |
| ఉత్తరాంధ్ర | 1.13 cr |
| ఈస్ట్ | 0.88 cr |
| వెస్ట్ | 0.51 cr |
| గుంటూరు | 1.02 cr |
| కృష్ణా | 0.53 cr |
| నెల్లూరు | 0.46 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 8.49 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.34 Cr |
| ఓవర్సీస్ | 0.10 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 8.93 cr |
‘సీటీమార్’ చిత్రానికి రూ.13.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.8.93 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో రూ.4.30 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ చూస్తుంటే అది అసాధ్యమనిపిస్తుంది.
Click Here For Review
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!












