వరుస ప్రమాదాలు, ప్రముఖుల మరణాలతో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల వారు షాక్ అవుతున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో కైకాల సత్య నారాయణ, సీనియర్ నటి జమున కన్నుమూసిన సంగతి మర్చిపోకముందే ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ఇకలేరనే వార్తతో టీలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. అలాగే ఇతర ఇండస్ట్రీలలోనూ ఈమధ్య కాలంలో చిత్ర రంగానికి చెందిన వారు మరణించారు. తాజాగా ఓ పాపులర్ నటుడు అనారోగ్యంతో మృతి చెందారనే న్యూస్‌తో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది..
వివరాల్లోకి వెళ్తే.. తంగరాజ్ కోలీవుడ్‌లో సీనియర్ నటుడు. గతకొంతం కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున (ఫిబ్రవరి 3) కన్నుమూశారు. తంగరాజ్ రంగస్థలం నుండి సినిమాల్లోకి వచ్చారు. ‘పరియేరుమ్ పెరుమాళ్’ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇల్లు లేని ఆయనకు తమిళనాడు ప్రభుత్వం ఓ ఇంటిని కట్టించి ఇచ్చింది. తంగారాజ్ ప్రస్తుతం తిరునళ్వేలి జిల్లా, పళాయన్‌గొట్టైలోని ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఆ ఇంటికి కరెంట్ సదుపాయం కూడా లేదు.
సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థికంగా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఆసుపత్రికి వెళ్లడానికి కూడా డబ్బులేక నరకం చూశారు. ఆఖరికి మందులు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అనారోగ్యంతోనే కన్నుమూశారు.. తంగరాజ్ మరణంపై పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్.. ‘‘రెస్ట్ ఇన్ పీస్ ఫాదర్.. మీ అడుగు జాడలు నా చివరి సినిమా వరకు గుర్తుంటాయి’’ అని ట్వీట్ చేశారు.
ஆங்காரமாய் ஆடியது போதும் இளைப்பாறுங்கள் அப்பா என் கடைசி படைப்பு வரையிலும் உங்கள் பாதச்சுவடிருக்கும் .. பரியேறும் பெருமாள். pic.twitter.com/P3lMZK3OiA
— Mari Selvaraj (@mari_selvaraj) February 3, 2023
#RIP Nellai Thangaraj (Pariyerum Perumal) pic.twitter.com/XU7dA9zfMH
— Christopher Kanagaraj (@Chrissuccess) February 3, 2023
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?