కుట్టి పద్మిని.. సీనియర్ నటీమణుల్లో ఒకరు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, కమల్ హాసన్, రజినీకాంత్ వంటి దిగ్గజాలతో ఆమె కలిసి నటించింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె కమల్ హాసన్ పై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. కమల్ హాసన్ ఎఫైర్లు పెట్టుకోవడంలో సకల కళావల్లభుడు అంటూ వ్యగ్యంగా మాట్లాడింది. పద్మిని మాట్లాడుతూ.. “కమల్ హాసన్.. శ్రీవిద్య, రేఖ, జయసుధ, వాణీ గణపతితో సహా మరో నటీమణులతో కూడా కలుపుకుని ఒకేసారి ఆరుగురితో ప్రేమాయణం నడిపాడు.
కానీ చివరికి వాణీ గణపతిని పెళ్లిచేసుకున్నాడు. వీరి పెళ్లి వార్త శ్రీదేవి, శ్రీవిద్యలను ఆశ్చర్యానికి గురి చేసింది. శ్రీవిద్య కమల్ హాసన్ ను ఎంతో ఇష్టపడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అతనికి పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. నేను… కమల్ తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన వాణితో ప్రేమలో పడ్డారు. నా ముందే ఎయిర్పోర్ట్ లో ఆమెకు గిఫ్ట్ కూడా కొన్నాడు. ఆ తర్వాత అతని మనసు మద్రాస్ కు చెందిన రేఖపై మళ్లింది.
ఈ విషయాన్ని నేను నేరుగా వెళ్లి శ్రీవిద్యకు చెప్పా. కానీ ఆమె నమ్మలేదు. (Kamal Haasan) కమల్ కు ‘సకలకళా వల్లభుడు’ అన్న బిరుదు ఊరికే రాలేదు. ఇందుకే వచ్చింది. ఇక కమల్ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత.. శ్రీవిద్య చాలా రోజులు దాన్ని నమ్మలేకపోయింది. డిప్రెషన్ కు లోనయ్యింది. కానీ కొన్నేళ్ల తర్వాత జార్జ్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే అతనితో విడిపోవడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చిదని.
అటు తర్వాత సినిమాల నుండి తప్పుకున్న శ్రీవిద్య తిరువనంతపురంలో సెటిల్ అయ్యింది. తన ఆస్తి మొత్తాన్ని ఓ ట్రస్ట్ కు రాసివ్వడం కూడా జరిగింది.అటు తర్వాత ఆమెకు క్యాన్సర్ రావడం.. దీంతో 2006లో మరణించడం జరిగిందని కూడా కుట్టి పద్మిని తెలిపారు. తెలుగులో శ్రీవిద్య చివరగా విజయ్ ఐపీఎస్ అనే సినిమాలో నటించింది. సుమంత్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.