మరో 48 గంటల్లో థియేటర్లలో కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. కేజీఎఫ్ ఛాప్టర్1 అంచనాలను మించి విజయం సాధించడంతో కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. ఉదయం 8 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.
అయితే తెలుగులో సీక్వెల్ సినిమాలు ఎక్కువశాతం సక్సెస్ సాధించలేదు. బాహుబలి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి2 ఘన విజయాన్ని సొంతం చేసుకోగా తెలుగులో చాలా సినిమాల సీక్వెల్స్ మాత్రం అనుకూల ఫలితాలను అందుకోలేదు. కేజీఎఫ్2 సినిమా సీక్వెల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందేమో చూడాలి. బీస్ట్ సినిమా నుంచి పోటీ ఎదురు కావడంతో కేజీఎఫ్2 కలెక్షన్లపై ఆ సినిమా ప్రభావం కొంతమేర పడే అవకాశాలు అయితే ఉంటాయి. హిందీ జెర్సీ వాయిదా పడటం కేజీఎఫ్2 సినిమాకు కలిసొస్తుందని చెప్పవచ్చు.
కేజీఎఫ్2 సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా తర్వాత వారాల్లో పెద్ద సినిమాలు రిలీజవుతూ ఉండటం గమనార్హం. కేజీఎఫ్2 ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు లాభాలను అందిస్తుండటం గమనార్హం. దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ ఈ సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కేజీఎఫ్2 బాక్సాఫీస్ వద్ద నయా రికార్దులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు ఆర్ఆర్ఆర్ స్థాయిలో క్రేజ్ లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.