Shah Rukh Khan: ‘జవాన్’ సాంగ్‌కు హాస్పిటల్‌లో పేషెంట్ డ్యాన్స్… షారుఖ్ రిప్లై ఇదే!
- September 16, 2023 / 07:32 PM ISTByFilmy Focus
షారుఖ్ ఖాన్‌ను బాలీవుడ్ బాద్‌షా అంటారు. కొందరైతే కింగ్ ఖాన్ అంటారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ఆయనను వైద్యుడితో పోలుస్తోంది. అంతేకాదు ఆయన వైద్యం చేయగలడు అంటూ కామెంట్ చేసింది. ఆ మాటలు, వాటికి షారుఖ్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘జవాన్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. రూ. 700 కోట్లకుపైగా వసూళ్లతో ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు దగ్గర తన దండయాత్ర కొనసాగిస్తోంది.
ఓవైపు సినిమా సృష్టిస్తున్న, బ్రేక్ చేస్తున్న రికార్డుల గురించి మాట్లాడుతుంటే మరోవైపు ఆ సినిమాలోని ‘ఛలేయా..’ పాట రీల్స్ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే షారుఖ్‌ను డాక్టర్‌ని చేస్తూ ఓ యువతి పోస్ట్ చేశారు. షారుఖ్ లేడీ ఫ్యాన్ ప్రిషా డేవిడ్ అనే ప్రొఫెషనల్ డ్యాన్సర్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ వైద్యం పొందుతూ… ‘జవాన్’ సినిమా పాటకు డాన్స్ చేశారు. దానికి సంబంధించిన పాటే ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ (Shah Rukh Khan) ‘SRKకి వైద్యం చేసే శక్తి ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ పోస్టు కింద కామెంట్ల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆ వీడియో చూసిన షారుఖ్ ఆమె డ్యాన్స్‌కి ఫిదా అయిపోయాడు. ఆ వీడియోకి రిప్లై కూడా ఇచ్చారు. ‘‘వీడియో చాలా బాగుంది. మీరు త్వరగా కోలుకుని ‘జవాన్’ సినిమా చూడండి. హాస్పిటల్ నుండి బయటకు వచ్చాక మరో డ్యాన్స్ వీడియో చేయాలి. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను. లవ్ యూ’’ అని రిప్లైలో రాశాడు.

‘జవాన్’ సినిమాలోని ‘ఛలేయా…’ పాట ఇప్పుడు ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. హిందీలో అర్జిత్ సింగ్, శిల్పా రావు ఆలపించగా, తమిళ వెర్షన్‌ను అనిరుధ్, ప్రియమాలి పాడారు. తెలుగు పాటను ఆదిత్య ఆర్కే, ప్రియామాలి ఆలపించారు. ఈ పాటకు ఫరా ఖాన్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.
This is very good! Thank u… Get well soon and watch the film!!! Looking forward to another dance video but once you’re out of the hospital…. Love u!! https://t.co/LjzAwSSP6k
— Shah Rukh Khan (@iamsrk) September 14, 2023
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!












