‘వకీల్‌సాబ్’ సినిమా ప్రచారంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించిన మాట సెకండాఫ్‌లో సర్‌ప్రైజ్. సినిమా ద్వితీయార్ధంలో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందని, అభిమానులకు అది మజానిస్తుందని చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. అయితే అదేంటో చెప్పకుండా ఊరిస్తూ వచ్చింది. అయితే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ సర్‌ప్రైజ్ విషయంలో పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు అంటూ… ఉత్సాహం నీరుగార్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. కానీ ఆ సర్‌ప్రైజ్ చాలా బాగుంటుంది అనేది ఇన్‌సైడర్ టాక్.
సినిమాకు కోర్టు సీన్లు ప్రాణం అని ‘పింక్’ చూస్తే చెప్పేయొచ్చు. అయితే అక్కడి సీన్లు యాజిటీజ్ తీస్తే ప్రేక్షకులకు కిక్ ఉండదు అని వేణు శ్రీరామ్ కొత్తగా సీన్లు రాసుకున్నాడట. అవి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. సుమారు 20 నిమిషాలు ఉండే ఆ కోర్టు సీన్లు సినిమాను అంతెత్తులో కూర్చోబెడతాయని అంటున్నారు. అయితే అవి అభిమానులకు కనెక్ట్ అవుతాయా లేదా అనేది చూడాలి. సినిమా క్లైమాక్స్‌లో సరైన ఫైట్ లేకపోతే పవన్ సినిమా అభిమానులకు ఎక్కదు. గతంలో పవన్ సినిమాలు అలా క్లైమాక్స్‌లో బోల్తాపడ్డాయి.
ఇప్పుడు ఆ సర్‌ప్రైజ్ ఎలిమెంట్, క్లైమాక్స్ ఫైట్ కలిసే ఉంటాయని కూడా వార్తలొస్తున్నాయి. క్లైమాక్స్‌లో ఓ ఫైట్ ఉంటుందని, ఆ వేడిని ఎంజాయ్ చేస్తుండగా, పవర్‌ఫుల్ డైలాగ్‌తో క్లైమాక్స్ సూపర్‌గా సాగుతుందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి ఆ సీన్స్‌లో పవన్ ఎలా చేస్తాడనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమాలో అకీరా నందన్ కనిపిస్తాడని, అదే సర్‌ప్రైజ్ ఎలిమెంట్ అని సోషల్ మీడియా టాక్. మరి ఇది నిజమవుతందా? ఏమో చూడాలి.